సపోర్ట్ తో ఆడిన రేవంత్, సపోర్ట్ గురించి మాట్లాడుతున్నాడు: ఫైమా
on Nov 29, 2022
బిగ్ బాస్ హౌస్ లో గొడవలు మామూలు అయ్యాయి. నామినేషన్స్ అంటేనే ఒకరి మీద ఒకరు సిల్లీ రీజన్స్ చెబుతూ నామినేషన్ చేసుకుంటారు. అయితే నిన్న మొన్నటి దాకా ఫైమా, ఇనయాల మధ్య గొడవ కాస్తా ఇప్పుడు రేవంత్, ఫైమాల మధ్య గొడవలా మారింది.
కారణం రేవంత్ తన సెకండ్ నామినేషన్ గా ఫైమాని చేసాడు. ఆ తర్వాత "ఫైమా.. నీకు ఎటకారం తగ్గిందని అనుకుంటున్నావ్. కానీ తగ్గలేదు. నీ వెటకారం నా వద్ద వద్దు. ఇంకెవరి దగ్గరైనా చూపించుకో. రోహిత్ ని స్ట్రాంగ్ అని నామినేట్ చేసావ్. రోహిత్ ని స్ట్రాంగ్ అంటున్నావ్ అంటే నువ్వు వీక్. అయినా వీక్.. వీకెస్ట్ కంటెస్టెంట్ హౌస్ లో ఉండకూడదు. ఇది నా సెకండ్ పాయింట్" అని రేవంత్, ఫైమాతో అన్నాడు. "నువ్వు ఏం చేసినా కరెక్ట్. నేనే తోపు అని అనుకోకు. నువ్వే సపోర్ట్ తో ఆడినవ్. సపోర్ట్ తో ఆడిన రేవంత్.. సపోర్ట్ గురించి మాట్లాడుతున్నాడు" అని ఫైమా వేలు చూపిస్తూ మాట్లాడింది. "వేలు చూపించి మాట్లాడకు. నార్మల్ గా మాట్లాడు ఫైమా" అని రేవంత్ గట్టిగా అరిచాడు.
"ముందు ఒక మాట మాట్లాడుతాడు. వెనుకాల ఒకటి మాట్లాడుతాడు. అది ఎవరికి ఎందుకు కనపడట్లేదు" అని ఫైమా అంది. అయితే ఈ వారం ఫైమా, రేవంత్ ఇద్దరూ కూడా నామినేషన్స్ లో ఉన్నారు. వీళ్ళిద్దరిలో స్ట్రాంగ్ ఎవరంటే కచ్చితంగా రేవంత్ అనే చెబుతారు. అంత ఫ్యాన్ బేస్ సంపాందించుకున్నాడు రేవంత్. కానీ ఫైమా మాత్రం ఎప్పుడు చూసినా, తన అతితెలివితో గొడవలకు దిగుతుంది. అయితే వీళ్ళిద్దరిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారో చూడాలి మరి.
Also Read